గాన్ విత్ ద విండ్ (సినిమా)
గాన్ విత్ ద విండ్ | |
---|---|
దర్శకత్వం | విక్టర్ ఫ్లెమింగ్ |
స్క్రీన్ ప్లే | సిడ్నీ హోవర్డ్ |
దీనిపై ఆధారితం | గాన్ విత్ ద విండ్ (నవల) by మార్గరెట్ మిచెల్ |
నిర్మాత | డేవిడ్ ఓ సెల్జెనిక్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎర్నెస్ట్ హ్యాలర్ |
కూర్పు |
|
సంగీతం | మాక్స్ స్టైనర్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | లూయీస్ ఇన్‌క్.[1][nb 1] |
విడుదల తేదీ | డిసెంబరు 15, 1939(అట్లాంటా) |
సినిమా నిడివి |
|
దేశం | అమెరికా |
భాష | ఇంగ్లీషు |
బడ్జెట్ | $3.85 మిలియన్లు |
బాక్సాఫీసు | >$390 మిలియన్లు |
గాన్ విత్ ది విండ్ 1939లో విడుదలైన అమెరికన్ ఐతిహాసిక చారిత్రక రొమాంటిక్ సినిమా. 1936లో మార్గరెట్ మిచెల్ రచించిన నవల ఆధారంగా తీయబడిన ఈ సినిమా సెల్జెనిక్ ఇంటర్నేషనల్ పిక్చర్స్ బ్యానర్‌పై డేవిడ్ ఓ. సెల్జెనిక్ నిర్మించాడు. విక్టర్ ఫ్లెమింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. అమెరికన్ సివిల్ వార్, పునర్నిర్మాణ యుగం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా స్కార్లెట్ ఓ'హారా, యాష్లీ విల్కెస్‌ల ప్రణయ శృంగార కథను వివరిస్తుంది.
కథ
[మార్చు]జార్జియా రాష్ట్రంలో పుట్టి పెరిగిన స్కార్లెట్ ఓ హారా తన జీవితాన్ని ఎలా నడుపుకుంటూ వచ్చింది అనేది ఈ చిత్ర కథ. ఆమె యాష్ లీ అనే అతన్ని ప్రేమిస్తుంది. కానీ అతను మెలనీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. చాలా కోపంతో స్కార్లెట్ మెలనీ తమ్ముడైన చార్లెస్‌ను పెళ్ళి చేసుకుంటుంది. కానీ చార్లెస్ ఆ తరువాత కొద్ది కాలానికే చనిపోతాడు. ఆమె ఆ విషాదంలో ఉన్న సమయంలోనే రెట్ బట్లర్‌తో డ్యాన్స్ చేస్తుంది. అప్పటికే అట్లాంటా నగరం అమెరికా అంతర్యుద్ధంలో మునిగి ఉంటుంది. కాలిపోతున్న ఇళ్ళల్లోంచి బట్లర్, స్కార్లెట్‌ను ఆమె బంధువులను రక్షిస్తాడు. ఇదే సమయంలో స్కార్లెట్ ఆస్తులను ఆమె పునరుద్ధరించి, చివరికి బట్లర్‌ను వివాహమాడుతుంది. అయినా ఆమెకు యాష్ అంటే ఇష్టం తగ్గదు. అది గుర్తించి బట్లర్ ఆమెను వదిలి వెళ్ళిపోతానంటాడు. ఆమె అతనిని బతిమాలుతుండగా కథ ముగుస్తుంది.[3]
నటీనటులు
[మార్చు]- తారా ప్లాంటేషన్‌లో
- థామస్ మిట్చెల్ - గెరాల్డ్ హోరా పాత్రలో
- బార్బరా ఓ నీల్ - ఎలెన్ ఓ హోరా
- వివియన్ లీ - స్కార్లెట్ ఓ హోరా
- ఈవ్‌లిన్ కీస్ - సుల్లెన్ ఓ హోరా
- ఆన్ రూథర్‌ఫర్డ్ - కరీన్ ఓ హోరా)
- జార్జ్ రీవ్స్ - బ్రెంట్ టర్లెటన్ (నిజానికి స్టూవర్ట్‌గా)[nb 2]
- ఫ్రెడ్ క్రేన్ - స్టూవర్ట్ టర్లెటన్ (నిజానికి బ్రెంట్‌గా)[nb 2]
- హాట్టీ మెక్‌డేనియల్- మమ్మీ (పనిమనిషి)[nb 3]
- ఆస్కార్ పోల్క్ - పోర్క్ (పనిమనిషి)[nb 3]
- బటర్‌ఫ్లై మెక్వీన్- ప్రిస్సీ (పనిమనిషి)[nb 3]
- విక్టర్ జోరీ - జోనాస్ విల్కర్‌సన్ (సూపర్‌వైజర్)
- ఎవరెట్ బ్రౌన్ - బిగ్ సామ్ (ఫోర్‌మాన్)
- ట్వెల్వ్ ఓక్స్‌లో
- హోవర్డ్ హిక్‌మాన్ - జాన్ విల్కెస్
- అలీషియా రెట్ - ఇందియా విల్కెస్
- లెస్లీ హోవర్డ్ - యాష్ లీ విల్కెస్
- ఒలివియా డే హావిలాండ్ - మెలనీ హామిల్టన్
- రాండ్ బ్రూక్స్ - ఛార్లెస్ హామిల్టన్
- కరోల్ నై - ఫ్రాంక్ కెన్నడీ
- క్లార్క్ గేబుల్ - రెట్ బట్లర్
- అట్లాంటాలో
- లారా హోప్ క్రూస్ - పిట్టీపాట్ హామిల్టన్
- ఎడ్డీ ఆండర్సన్ - అంకుల్ పీటర్
- హ్యారీ డావెన్‌పోర్ట్ - డాక్టర్ మీడ్
- లీనా రాబర్ట్స్ - మిసెస్ మీడ్
- జేన్ డార్వెల్ - మిసెస్ మెర్రివెదర్
- ఓన మన్సన్ - బెల్లె వాట్లింగ్
- సహాయపాత్రలలో
- పాల్ హర్స్ట్
- కామీ కింగ్
- జె.ఎం.కెర్రిగన్
- జాకీ మోరన్
- లిలియన్ కెంబుల్ కూపర్
- మర్సెల్లా మార్టిన్
- మికీ కున్
- ఇర్వింగ్ బేకన్
- విలియం బేక్‌వెల్
- ఇసాబెల్ జువెల్
- ఎరిక్ లిండెన్
- వార్డ్ బాండ్
- క్లిఫ్ ఎడ్వర్డ్స్
- యకీమ కానట్
- లూయిస్ జీన్ హెయ్ద్‌ట్
- ఓలిన్ హౌలాండ్
- రాబర్ట్ ఇలియట్
- మేరీ ఆండర్సన్
నిర్మాణం
[మార్చు]ఈ చిత్రానికి మార్గరెట్ మిచెల్ రచించిన నవల ఆధారం. ఈ 1,037 పేజీల ఈ నవల వెలువడక మునుపే ఈ నవలను చిత్రీకరించే హక్కులను డేవిడ్ ఓ సెల్జనిక్ కొనుగోలు చేశాడు. ఆయన కంపెనీలో స్టోరీ ఎడిటర్‌గా పనిచేస్తున్న కే బ్రౌన్ ఆ నవలను ముందు చదివి, దానిపై హక్కులు తీసుకోవలసిందిగా సెల్జనిక్‌కు సలహా ఇచ్చింది. సెల్జనిక్ ఆ నవల చదివి, నవల చాలా పెద్దదిగా ఉందని భావించి, కొంతకాలం సందేహించాడు. చివరికి కేవలం 50 వేల డాలర్ల ఖరీదుకు ఆ నవల చిత్రీకరణ హక్కులు పొందాడు. ఈ మొత్తం ఆ చిత్రం సంపాదించిన మొత్తంలో 0.0005 శాతం మాత్రమే.[3][4][5][6]
నటీనటుల ఎంపిక
[మార్చు]పాఠకుల సూచనలమేరకు రైట్ బట్లర్ పాత్రకు క్లార్క్ గేబుల్‌ను ఎంచుకున్నా, హీరోయిన్ పాత్ర స్కార్లెట్ ఓ హారా పాత్ర కోసం ఆయన సుమారు 1400 మంది అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసి, తొంభైమందికి స్క్రీన్ టెస్ట్ చేసి, చివరకు వివియన్ లీను ఎంచుకున్నాడు. అయితే ఎందరో అమెరికన్ అమ్మాయిలను పరీక్షించి, చివరకు భారతదేశంలోని డార్జిలింగ్ పుట్టిన ఒక బ్రిటిష్ అమ్మాయిని ఎంచుకోవటం పట్ల అమెరికాలో నిరసన వ్యక్తం అయింది. కానీ క్రమంగా ఆమె అమెరికన్ల హృదయం కూడా గెలుచుకుంది.[3] స్కార్లెట్ పాత్ర ఎంపిక కోసం $100,000 ఖర్చయ్యింది కానీ వెలలేని పబ్లిసిటీ లభించింది.[4]
స్క్రీన్ ప్లే
[మార్చు]ఈ సినిమా స్క్రీన్‌ప్లే వ్రాయడానికి మొత్తం 15 మంది రచయితలు పాల్గొన్నారు.[3] మొదట సిడ్నీ హోవార్డ్ 1037 పేజీల నవలను సినిమాకు అనుగుణంగా తయారు చేసిన స్క్రీన్ ప్లే చాలా పెద్దగా అంటే కనీసం ఆరుగంటల నిడివి కలిగిన సినిమా తయారయ్యే విధంగా ఉంది. దానిని సవరించడానికి నిర్మాత అతడిని తమతోనే ఉండమని కోరాడు. కానీ హోవార్డ్ లండన్ వదిలి రావడానికి నిరాకరించాడు. దానితో సవరణలను చేయడానికి స్థానిక రచయితలను నియమించాడు.[7] దర్శకుడు ఈ స్క్రీన్ ప్లే సవరణల పట్ల అసంతృప్తిగా ఉండటంతో మొత్తం స్క్రీన్ ప్లేను ఐదురోజులలో తిరిగి వ్రాయమని బెన్ హెచ్‌ను నియమ్ంచాడు. అతడు మొదటి సగం పనిని మాత్రం పూర్తి చేయగలిగాడు. దానితో నిర్మాత అయిన సెల్జినిక్ మిగిలిన సగం స్క్రీన్ ప్లే వ్రాయడానికి పూనుకున్నాడు.[8]
చిత్రీకరణ
[మార్చు]చిత్రీకరణ 1939 జనవరి 26న ప్రారంభమై జూలై 1న ముగిసింది, పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ 1939 నవంబరు 11 వరకు కొనసాగింది.[9]
సంగీతం
[మార్చు]ఈ చిత్ర్రంలో సంగీతాన్ని కంపోజ్ చేయడానికి, సెల్జెనిక్ ఆర్.కె.ఓ. పిక్చర్స్‌లో పనిచేసిన మాక్స్ స్టెయినర్‌ను ఎంచుకున్నాడు. స్టెయినర్ ఈపనిపై పన్నెండు వారాలు పనిచేశాడు. రెండు గంటల ముప్పై-ఆరు నిమిషాల నిడివిలో ఇతడు కూర్చిన అతి పొడవైన సంగీతం ఇది. ఈ సినిమా కోసం హ్యూగో ఫ్రైడ్‌హోఫర్, మారిస్ డి ప్యాక్, బెర్న్‌హార్డ్ కౌన్, అడాల్ఫ్ డ్యూచ్, రెజినాల్డ్ బాసెట్ అనే ఐదుగురు ఆర్కెస్ట్రేటర్‌లను నియమించారు.
దీనిలో రెండు ప్రేమ థీమ్‌లు ఉన్నాయి, ఒకటి యాష్లే, మెలానీల మధురమైన ప్రేమ కాగా మరొకటి యాష్లే పట్ల స్కార్లెట్‌కు ఉన్న ఇష్టాన్ని రేకెత్తిస్తుంది. స్టెయినర్ జానపద, దేశభక్తి సంగీతాన్ని గణనీయంగా వాడుకున్నాడు. ఇందులో "లూసియానా బెల్లె", "డాలీ డే", "రింగో డి బాంజో", "బ్యూటిఫుల్ డ్రీమర్", "ఓల్డ్ ఫోక్స్ ఎట్ హోమ్", "కేటీ బెల్లె" వంటి స్టీఫెన్ ఫోస్టర్ ట్యూన్‌లు ఉన్నాయి. ప్రముఖంగా కనిపించే ఇతర ట్యూన్‌లు: హెన్రీ క్లే వర్క్‌చే "మార్చింగ్ త్రూ జార్జియా", "డిక్సీ", "గారియోవెన్", "ది బోనీ బ్లూ ఫ్లాగ్". సినిమాతో ఎక్కువగా కలిసిపోయిన ఇతివృత్తం తారా ఓ'హారా ప్లాంటేషన్‌తో కూడిన మెలోడీ. మొత్తంగా, స్కోర్‌లో తొంభై తొమ్మిది వేర్వేరు సంగీత భాగాలు ఉన్నాయి.
విడుదల
[మార్చు]ప్రివ్యూ, ప్రీమియర్, తొలి విడుదలలు
[మార్చు]1939 సెప్టెంబరు 9వ తేదీన నిర్మాత సెల్జెనిక్, అతని భార్య ఐరేన్, పెట్టుబడిదారుడు జాక్ విట్నీ, ఫిల్మ్ ఎడిటర్ హాల్ కెర్న్ కాలిఫోర్నియాలోని ఫాక్స్ థియేటర్‌కు చేరుకున్నారు. అప్పటికి ఇంకా సినిమా పూర్తిగా ఎడిటింగ్ చేయబడలేదు. అది నాలుగు గంటల ఇరవై ఐదు నిముషాలపాటు నడిచింది. తరువాత దానిని విడుదల కోసం చాలా కుదించారు. ఆరోజు ఆ థియేటర్‌లో ఒకే టికెట్టుపై రెండు సినిమాలు చూపిస్తున్నారు. మొదటి సినిమా హవాయియన్ నైట్స్ తరువాత ప్రదర్శించాల్సిన సినిమాకు బదులుగా ఇంకా పేరుపెట్టని రాబోయే ఒక సినిమా ప్రివ్యూను చూపిస్తున్నామని, ప్రేక్షకులు థియేటర్‌ను వదిలి వెళ్ళవచ్చని, కానీ ప్రివ్యూ మొదలయ్యాక మళ్ళీ లోపలికి అనుమతించబోమని ప్రకటించారు. సినిమా పేర్లు పడగానే ప్రేక్షకులు చప్పట్లు చరిచి సినిమా ముగిసిన తరువాత అందరూ లేచినిలబడి తమ ఆనందాన్ని ప్రకటించారు.[9][10]
1939 డిసెంబరు 15. హాలివుడ్ చరిత్రను మలుపు తిప్పిన రోజు. ఆ రోజే 'గాన్ విత్ ది విండ్' చిత్రం విడుదలయింది. జార్జియాలోని అట్లాంటా నగరంలో ఆ చిత్రం ప్రీమియర్ షో ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శనకు చిత్రంలో నటించిన తారలు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. పుష్పాలంకృతమైన 50 కార్లలో వీరు విచ్చేశారు. కేవలం 3 లక్షల జనాభా ఉండే అట్లాంటా నగరం ఆ రోజు 15 లక్షల మంది జనాభా కేంద్రమయింది. ఆ రోజు నగరమంతా 'గాన్ విత్ ది విండ్' గాలే![3] జార్జియా గవర్నరు ఆ రోజు ( 1939 డిసెంబరు 15)ను సెలవుగా ప్రకటించాడు.[11]{[12]
1939 డిసెంబరు నుండి 1940 జూలై వరకూ రోడ్ షోల ద్వారా అడ్వాన్స్ బుకింగులతో మామూలు టికెట్ ధరకన్నా రెట్టింపు ధరకు అమ్మి సినిమాను ప్రదర్శించారు. బాక్సాఫీస్ వసూళ్ళలో 70 శాతం వాటాను ఈ సినిమా పొందగలిగింది. కొంత కాలం తరువాత 1941లో ఈ సినిమా మామూలు టికెట్టు ధరకు సాధారణ ప్రేక్షకులకోసం విడుదలయ్యింది.[13] ప్రకటన ఖర్చులు, పంపిణీ ఖర్చులు అన్నీ కలుపుకుని ఈ సినిమా నిర్మాణ��నికి $7 మిలియన్లు వ్యయం అయ్యింది.[12][14]
తరువాతి విడుదలలు
[మార్చు]1942లో, సెల్జెనిక్ పన్నుల కారణంగా తన కంపెనీని రద్దు చేశాడు. గాన్ విత్ ది విండ్‌లో తన వాటాను తన వ్యాపార భాగస్వామి జాన్ విట్నీకి $500,000కి విక్రయించాడు. విట్నీ దానిని ఎం.జి.ఎం.కి $2.8 మిలియన్లకు విక్రయించింది, తద్వారా ఎం.జి.ఎం.స్టూడియో పూర్తిగా సినిమాని తన సొంతం చేసుకుంది.[14] వెంటనె ఎం.జి.ఎం. ఈ సినిమాను 1942 వసంతకాలంలో [8], 1947లో, 1954లో [9] మళ్ళీ విడుదల చేశారు. 1954లో విడుదలైన సినిమా వైడ్ స్క్రీన్ ఫార్మాట్‌లో (1.75:1 నిష్పత్తి) తయారు చేశారు. అలా చేయడానికి ఐదు షాట్లలో మార్పులు చేశారు.[15]
అమెరికాలో అంతర్యుద్ధం ప్రారంభమ��న వందేళ్ళ సందర్భంగా 1961లో ఈ చిత్రాన్ని మళ్ళీ లూయీస్ గ్రాండ్ థియేటర్‌లో మళ్ళీ ప్రదర్శించారు. ఆ ప్రదర్శనకు సెల్జెనిక్, నటీనటులు వివియన్ లీ, ఒలివియా డే హావిలాండ్ తదితరులు హాజరయ్యారు.[16] 1967లో ఈ సినిమా 70ఎం.ఎం.ఫార్మాట్‌లో విడుదలయ్యింది.[9] తరువాత ఈ సినిమా 1971, 1974, 1989లలో పునర్విడుదలయ్యింది. 1989లో ఈ సినిమా నిర్మించి అర్ధశతాబ్ది గడిచిన సందర్భంగా విడుదల కావడం విశేషం.1998లో మరోసారి విడుదలయ్యింది.[17][18]
2013లో, 4కె రెసొల్యూషన్‌లో డిజిటట్ ఫార్మాట్లో పునరుద్ధరించి విడుదల చేశారు. యాధృచ్చికంగా అది వివియన్ లీ శతజయంతి కావడం కూడా ఒక విశేషం.[19] సినిమా విడుదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2014లో అమెరికా అంతటా రెండురోజులు ఈ సినిమాను అనేక థియేటర్లలో ప్రదర్శించారు.[20]
ఆదరణ
[మార్చు]విమర్శకుల స్పందన
[మార్చు]సినిమా విడుదలైన తర్వాత వార్తాపత్రికలు అద్భుతమైన సమీక్షలను అందించాయి;[9] అయినప్పటికీ, దాని నిర్మాణ విలువలు, సాంకేతిక విజయాలు, ఆశయం యొక్క స్థాయి విశ్వవ్యాప్తంగా గుర్తించబడినప్పటికీ, ఆ సమయంలోని కొంతమంది సమీక్షకులు ఈ చిత్రం చాలా పొడవుగా ఉందని విమర్శించారు. నాటకీయంగా ఆమోదయోగ్యంగా లేదని కొందరు వ్యాఖ్యానించారు. అత్యంత ప్రతిష్ఠాత్మక చలనచిత్ర నిర్మాణం అయినప్పటికీ, ఇది అంత గొప్ప చిత్రం కాకపోవచ్చునని కానీ "ఆసక్తికరమైన కథ అందంగా చెప్పబడింది" అని "ది న్యూయార్ టైమ్స్" పత్రికలో ఫ్రాంక్ ఎస్.న్యూజెంట్ అనే విమర్శకుడు తన అభిప్రాయాన్ని తెలిపాడు.[21] ది నేషన్‌కు చెందిన ఫ్రాంజ్ హోలెరింగ్ ఇదే అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తం చేశాడు: "ఫలితం అనేది పరిశ్రమ చరిత్రలో ఒక ప్రధాన సంఘటన, కానీ చలనచిత్ర కళలో ఇది ఒక చిన్న విజయం మాత్రమే"[22]
నవలను చిత్రీకరించడం పట్ల ఉన్న విశ్వసనీయతకు ఈ సినిమా ప్రశంసలు అందుకుంది.[21] వెరైటీ పత్రికకోసం జాన్ సి.ఫ్లిన్ అనే విమర్శకుడు సెల్జెనిక్ "చాలా ఎక్కువ వదిలేశాడని" రాశాడు. కథలోని చివరి భాగం నుండి పునరావృతమయ్యే సన్నివేశాలు, సంభాషణలను కుదించి ఉంటే సినిమా మరింత ప్రయోజనకారిగా ఉండివుండేదని భావించాడు.[23] కథలో కాలవ్యవధిని సమర్ధించే నాణ్యత లేకపోవడం ఒక తీవ్రమైన లోపంగా ది మాంచెస్టర్ గార్డియన్ పత్రిక పేర్కొంది.
అకాడమీ అవార్డులు
[మార్చు]12వ అకాడమీపురస్కారాలలో, గాన్ విత్ ది విండ్ రికార్డు సృష్టించింది. మొత్తం పదమూడు నామినేషన్ల నుండి ఎనిమిది పోటీ విభాగాల్లో నామినేట్ చేయబడింది. ఇది ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కళా దర్శకత్వం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాలలో అవార్డును గెలుచుకుంది. మరో రెండు విభాగాలలో గౌరవ పురస్కారాలను అందుకుంది..[24][25] దాదాపు 20 సంవత్సరాల తరువాత 1959లో మాత్రమే 'గాన్ విత్ ది విండ్' చిత్రం రికార్డును 11 ఆస్కార్ అవార్డులతో 'బెన్ హర్' చిత్రం అధిగమించింది.[3]
పురస్కారం | గ్రహీత (లు) | ఫలితం |
---|---|---|
అసాధారణ నిర్మాణం | సెల్జెనిక్ ఇంటర్నేషనల్ పిక్చర్స్ | గెలుపు |
ఉత్తమ దర్శకుడు | విక్టర్ ఫ్లెమింగ్ | గెలుపు |
ఉత్తమ నటుడు | క్లార్క్ గేబుల్ | ప్రతిపాదన |
ఉత్తమ నటి | వివియన్ లీ | గెలుపు |
ఉత్తమ సహాయనటి | ఒలివియా డే హావిలాండ్ | ప్రతిపాదన |
హాట్టీ మెక్‌డేనియల్ | గెలుపు | |
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే | సిడ్నీ హోవర్డ్ | గెలుపు |
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ | లైల్ వీలర్ | గెలుపు |
ఉత్తమ సినిమాటోగ్రఫీ - కలర్ | ఎర్నెస్ట్ హ్యాలర్ & రే రెన్నహాన్ | గెలుపు |
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ | హాల్ సి.కెర్న్ & జేమ్స్ ఇ.న్యూకామ్ | గెలుపు |
ఉత్తమ సంగీతం | మాక్స్ స్టెయినర్ | ప్రతిపాదన |
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ | థామస్ టి.మౌల్టన్ | ప్రతిపాదన |
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ | జాక్ కాస్‌గ్రోవ్, ఫ్రెడ్ ఆల్బిన్, ఆర్థర్ జాన్స్ | ప్రతిపాదన |
ప్రత్యేక అవార్డు | విలియమ్ కామెరాన్ మెంజీస్ గాన్ విత్ ది విండ్ నిర్మాణంలో నాటకీయ వాతావరణాన్ని పెంపొందించడం కోసం రంగును ఉపయోగించడంలో అత్యుత్తమ సాధన కోసం. |
గౌరవ |
టెక్నికల్ అఛీవ్‌మెంట్ అవార్డు | డాన్ ముస్గ్రేవ్ & సెల్జెనిక్ ఇంటర్నేషనల్ పిక్చర్స్ గాన్ విత్ ది విండ్ నిర్మాణంలో సమన్వయంతో కూడిన పరికరాలను ఉపయోగించడంలో ముందున్నందుకు. |
గౌరవ |
ఆఫ్రికన్-అమెరికన్ల స్పందన
[మార్చు]ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి బానిసత్వం సమస్యను తప్పుదోవపట్టించే ప్రయత్నంగా నల్లజాతీయుల వ్యాఖ్యాతలచే విమర్శించబడింది. అయితే, ప్రారంభంలో, శ్వేతజాతీయుల నియంత్రణలో ఉన్న వార్తాపత్రికలు ఈ విమర్శలను ప్రచురించలేదు.[26] కార్ల్టన్ మోస్ అనే నల్లజాతీయుడైన నాటకకర్త ఒక బహిరంగ లేఖలో, ఈ సినిమా అమెరికన్ చరిత్ర, నీగ్రో ప్రజలపై వెనుకనుండి చేసిన దాడిగా అభివర్ణించాడు. "మారలేని , మొండి-బుద్ధిగల పోర్క్", "ఉదాసీన, బాధ్యతారహిత ప్రిస్సీ", బిగ్ సామ్ "బానిసత్వాన్ని ప్రకాశవంతంగా అంగీకరించడం" మమ్మీ తన "నిరంతరం వేధించడం ప్రతిదానిపై చులకన చేయడం" వంటి స్టీరియోటైపు నల్లజాతీయ పాత్రల రూపకల్పనను తీవ్రంగా నిరసించాడు.[27] అదేవిధంగా,మెల్విన్ బి. టోల్సన్ అనే కవి, విద్యావేత్త ఇలా అంటాడు "గాన్ విత్ ది విండ్ చాలా సూక్ష్మమైన అబద్ధం, దానిని మిలియన్ల శ్వేతజాతీయులు, నల్లజాతీయులు కూడా ఒకే విధంగా సత్యంగా భావిస్తున్నారు."[28] హాట్టీ మెక్‌డేనియల్ ఆస్కార్ విజయం తర్వాత నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ సంస్థకు చెందిన వాల్టర్ ఫ్రాన్సిస్ వైట్ ఆమెను అంకుల్ టామ్ అని ఆరోపించాడు. మెక్‌డేనియల్ ప్రతిస్పందిస్తూ, "ఏడు డాలర్లు ఒకటిగా ఉండటం కంటే పనిమనిషిగా నటించడం ద్వారా వారానికి ఏడు వందల డాలర్లు సంపాదించడం ఉత్తమం" నల్లజాతీయుల తరపున మాట్లాడటానికి వైట్‌కు ఉన్న అర్హతను ఆమె ప్రశ్నించింది.[29]
ప్రేక్షకుల స్పందన
[మార్చు]ఈ చిత్రాన్ని అమెరికాలో కనీసం మూడున్నర కోట్ల మంది ప్రేక్షకులు చూసి ఉంటారని అంచనా. అంతమంది ప్రేక్షకులు చూసిన సినిమా వేరొకటి అనేక దశాబ్దాలపాటు లేదన్నది వాస్తవం.[3] ఒక్క న్యూయార్క్‌లోనే క్యాపిటల్ థియేటర్‌లో, డిసెంబరు చివరిలో ఇది రోజుకు సగటున పదకొండు వేలమంది ఈ సినిమాను చూశారు.[13] విదేశాలలో కూడా ఇది విజయపరంపరను కొనసాగించింది. లండన్‌లోని బ్లిట్జ్ థియేటర్‌లో 1940 ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రదర్శన ప్రారంభమై నాలుగేండ్ల పాటు నిర్విరామంగా నడిచింది.[30]
1947లో ఈ సినిమా తిరిగి విడుదలైనప్పుడు అమెరికా, కెనడా దేశాలలో ఈ సినిమా ఐదు మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఆ ఏడాది విడుదలైన సినిమాలలో మొదటి పది స్థానాలలో ఈ సినిమాకు చోటుదక్కింది.[14][31]
పరిశ్రమ గుర్తింపు
[మార్చు]1977లో అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (AFI) సంస్థ నిర్వహించిన పోల్‌లో ఈ సినిమా అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికైంది.[9] AFI 1998లో "వంద అత్యంత గొప్ప చలనచిత్రాలు" జాబితాలో ఈ చిత్రానికి నాల్గవ స్థానం ఇచ్చింది,[32] 2007లో పదవ వార్షికోత్సవ సంచికలో ఇది ఆరవ స్థానానికి పడిపోయింది.[33] ఈ చలనచిత్ర దర్శకుడు విక్టర్ ఫ్లెమింగ్‌కు 2012లో నిర్వహించిన సైట్ & సౌండ్ దశవార్షిక పోల్‌లో 322వ ర్యాంక్ లభించింది.[34] 2016లో డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సభ్యుల పోల్‌లో తొమ్మిదవ ఉత్తమ "డైరెక్టోరియల్ అచీవ్‌మెంట్"గా ఈ సినిమా ఎంపికైంది.[35] 2014లో, ది హాలీవుడ్ రిపోర్టర్ చేపట్టిన విస్తృతమైన పోల్‌లో ఈ చిత్రం పదిహేనవ స్థానంలో నిలిచింది.[36]
1989లో యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో ఎంపిక చేసిన ఇరవై-ఐదు తొలితరం చిత్రాలలో గాన్ విత్ ది విండ్ ఒకటి.[37][38]
మూలాలు
[మార్చు]వివరణాత్మక నోట్సు
[మార్చు]- ↑ లూయీస్ ఎం.జి.ఎం. మాతృసంస్థ.[2]
- ↑ 2.0 2.1 చిత్రం టైటిల్స్‌లో ఒక పొరబాటు జరిగింది. జార్జ్ రీవ్స్ ను "బ్రెంట్ టార్లెటన్‌గా" పేర్కొన్నారు కానీ స్టువర్ట్‌గా నటించాడు, ఫ్రెడ్ క్రేన్ "స్టువర్ట్ టార్లెటన్‌గా" పేర్కొన్నారు, కానీ బ్రెంట్‌గా నటించాడు.[1]
- ↑ 3.0 3.1 3.2 హాటీ మెక్‌డానియల్, ఆస్కార్ పోల్క్ , బటర్‌ఫ్లై మెక్‌క్వీన్ ఈ చిత్రంలో బానిసలుగా నటించారు కానీ "హౌస్ సర్వెంట్స్"గా టైటిల్స్‌లో పేర్కొన్నారు.
అనులేఖనాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "గాన్ విత్ ద విండ్". ద అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ క్యాటలాగ్ ఆఫ్ మోషన్ పిక్చర్స్. అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్. Archived from the original on August 12, 2020. Retrieved January 12, 2013.
- ↑ గోమెరి, డౌగ్లాస్; పఫోర్ట్ ఓవర్డుయిన్, క్లారా (2011). మూవీ హిస్టరీ: ఎ సర్వే (2nd ed.). టేలర్ & ఫ్రాన్సిస్. p. 144. ISBN 9781136835254.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 పాలకోడేటి, సత్యనారాయణరావు (1 April 2007). హాలీవుడ్ క్లాసిక్స్ - 1 (1 ed.). హైదరాబాదు: అనుపమ సాహితి. pp. 50–52.
- ↑ 4.0 4.1 ఫ్రెడ్రిచ్, ఒట్టో (1986). సిటీ ఆఫ్ నెట్స్: ఎ పోర్ట్రైట్ ఆఫ్ హాలీవుడ్ ఇన్ 1940స్C. బర్క్‌లీ / లాస్ ఏంజెల్స్: యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్. pp. 17–21. ISBN 978-0-520-20949-7.
- ↑ "ద బుక్ పర్చేజ్". గాన్ విత్ ద విండ్ ఆన్‌లైన్ ఎక్జిబిట్. యూనివర్సిటీ ఆఫ్ టెక్సార్, ఆస్టిన్: హారీ రాన్‌సం సెంటర్. Archived from the original on June 2, 2014.
- ↑ "ద సెర్చ్ ఫర్ స్కార్లెట్:క్రోనాలజీ". గాన్ విత్ ద విండ్ ఆన్‌లైన్ ఎక్జిబిట్. యూనివర్సిటీ ఆఫ్ టెక్సార్, ఆస్టిన్: హారీ రాన్‌సం సెంటర్. Archived from the original on June 2, 2014.
- ↑ యెక్, జానీ (1984). "అమెరికన్ స్క్రీన్ రైటర్స్". డిక్షనరీ ఆఫ్ లిటరరీ బయోగ్రఫీ. గేల్.
- ↑ 8.0 8.1 బర్టెల్, పాలిన్ (1989). ద కంప్లీట్ గాన్ విత్ ద విండ్ ట్రివియా బుక్: ద మూవీ అండ్ మోర్. టేలర్ ట్రేడ్ పబ్లిషింగ్. pp. 64–69, 127 & 161–172. ISBN 978-0-87833-619-7.
- ↑ 9.0 9.1 9.2 9.3 9.4 9.5 "గాన్ విత్ ద విండ్ (1939) – నోట్స్". టిసిఎం డేటాబేస్. టర్నర్ క్లాసిక్ మూవీస్. Archived from the original on March 10, 2016. Retrieved January 16, 2013.
- ↑ బెల్, ఎలిసన్ (June 25, 2010). "ఇన్‌లాండ్ ఎంపైర్ సిటీస్ వర్ వన్స్ ఇన్ విత్ హాలీవుడ్ ఫర్ మూవీ ప్రివ్యూస్". లాస్ ఏంజెల్స్ టైమ్స్. Archived from the original on December 29, 2013. Retrieved January 25, 2013.
- ↑ "సినిమా: గాన్ విత్ ద విండ్". టైమ్. December 25, 1939. pp. 1–2 & 7. Archived from the original on November 12, 2013. Retrieved July 6, 2011.
- ↑ 12.0 12.1 లాంబర్ట్, గేవిన్ (March 1973). "ది మేకింగ్ ఆఫ్ గాన్ విత్ ద విండ్ పార్ట్ II". ది అట్లాంటిక్. Vol. 265, no. 6. pp. 56–72. Archived from the original on November 27, 2011.
- ↑ 13.0 13.1 షట్జ్, థామస్ (1999) [1997]. బూమ్ అండ్ బస్ట్:అమెరికన్ సినిమా ఇన్ 1940స్. హిస్టరీ ఆఫ్ ద అమెరికన్ సినిమా. Vol. 6. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్. pp. 65–66. ISBN 978-0-520-22130-7.
- ↑ 14.0 14.1 14.2 షేరర్, లాయిడ్ (October 26, 1947). "GWTW: సూపర్ కలోసల్ సాగా ఆఫ్ ఏన్ ఎపిక్". ది న్యూయార్క్ టైమ్స్. Archived from the original on May 31, 2013. Retrieved July 14, 2012.
- ↑ హేవర్, రోనాల్డ్ (1993). డేవిడ్ ఓ సెల్జెనిక్'స్ గాన్ విత్ ద విండ్. న్యూయార్క్: రాన్‌డమ్ హౌస్. pp. 84–85.
- ↑ బ్రౌన్, ఎలెన్ ఎఫ్.; విలీ, జాన్ జూనియర్. (2011). మార్గరెట్ మిచెల్'స్ గాన్ విత్ ద విండ్: ఎ బెస్ట్ సెల్లర్'స్ ఒడిస్సీ ఫ్రం అట్లాంటా టు హాలీవుడ్. టైలర్ ట్రేడ్ పబ్లికేషన్స్. pp. 287, 293 & 322. ISBN 978-1-58979-527-3.
- ↑ బ్లాక్, అలెక్స్ బెన్; విల్సన్, లూసీ ఆట్రే, eds. (2010). జార్జ్ లూకాస్ బ్లాక్‌బస్టింగ్:ఎ డికేడ్ బై డికేడ్ సర్వే ఆఫ్ టైమ్‌లెస్ మూవీస్ ఇన్‌క్లూడింగ్ అన్ టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ దెయిర్ ఫైనాన్షియల్ అండ్ కల్చరల్ సక్సెస్. హార్పర్ కాలిన్స్. pp. 220–221. ISBN 978-0-06-177889-6.
- ↑ క్రామర్, పీటర్ (2005). ద న్యూ హాలీవుడ్: ఫ్రం బోనీ అండ్ క్లైడ్ టు స్టార్ వార్స్. షార్ట్ కట్స్. Vol. 30. వాల్ ఫ్లవర్ ప్రెస్. p. 46. ISBN 978-1-904764-58-8.
- ↑ ఆండ్రూ, జియాఫ్. "గాన్ విత్ ద విండ్". బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్. Archived from the original on December 1, 2013.
- ↑ ఫ్రిస్టో, రోజర్. "గాన్ విత్ ద విండ్: 75త్ యానివర్సరీ – స్క్రీనింగ్ అండ్ ఈవెంట్స్". టర్నర్ క్లాసిక్ మూవీస్. Archived from the original on September 29, 2014. Retrieved September 28, 2014.
- ↑ 21.0 21.1 న్యూజెంట్, ఫ్రాంక్ ఎస్. (December 20, 1939). "ద స్క్రీన్ ఇన్ రివ్యూ; డేవిడ్ సెల్జెనిక్'స్ గాన్ విత్ ద విండ్ హాజ్ ఇట్స్ లాంగ్ అవెయిటెడ్ ప్రీమియర్ ఎట్ ఆస్టర్ అండ్ క్యాపిటల్, రీకాలింగ్ సివిల్ వార్ అండ్ ప్లాంటేషన్ డేస్ ఆఫ్ సౌత్ సీన్ యాజ్ ట్రీటింగ్ బుక్ విత్ గ్రేట్ ఫిడిలిటీ". ద న్యూయార్క్ టైమ్స్. Archived from the original on March 8, 2016. Retrieved February 1, 2013.
- ↑ హోలెరింగ్, ఫ్రాంజ్ (1939). "గాన్ విత్ ద విండ్". ది నేషన్ (published December 16, 2008). Archived from the original on May 21, 2014. Retrieved February 1, 2013.
- ↑ ఫ్లిన్, జాన్. సి.సీనియర్ (December 20, 1939). "గాన్ విత్ ద విండ్". వెరైటీ. Archived from the original on June 14, 2013. Retrieved June 14, 2013. Alt URL Archived నవంబరు 6, 2018 at the Wayback Machine
- ↑ "రిజల్ట్స్ పేజ్ – 1939 (12వ)". అకాడమీ అవార్డ్స్ డేటాబేస్. అకాడమీ ఆఫ్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. Archived from the original on ఏప్రిల్ 15, 2013. Retrieved ఫిబ్రవరి 3, 2013.
- ↑ రాండాల్, డేవిడ్; క్లార్క్, హెదర్ (February 24, 2013). "ఆస్కార్స్ - సినిమాస్ గోల్డెన్ నైట్: ద అల్టిమేట్ బ్లఫ్ఫర్స్ గైడ్ టు హాలీవుడ్స్ బిగ్ నైట్". ది ఇండిపెండెంట్. Archived from the original on February 26, 2013. Retrieved March 7, 2013.
- ↑ షుజ్లర్, జెన్నిఫర్ (2020-06-14). "ద లాంగ్ బ్యాటిల్ ఓవర్ 'గాన్ విత్ ద విండ్'". ది న్యూయార్క్ టైమ్స్. Archived from the original on June 20, 2020. Retrieved 2020-06-20.
- ↑ లుపాక్, బార్బరా టెపా (2002). లిటరరీ అడాప్టేషన్స్ ఇన్ బ్లాక్ అమెరికన్ సినిమా: ఫ్రం ఆస్కార్ మిచెక్స్ టు టోనీ మారిసన్. యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ ప్రెస్. pp. 209–211. ISBN 978-1-58046-103-0.
- ↑ గజానన్, మహిత (25 June 2020). "గాన్ విత్ ద విండ్ షుడ్ నాట్ బి ఎరేజ్డ్, ఆర్గ్యూ ఫిల్మ్ హిస్టోరియన్స్. బట్ ఇట్ షుడ్ నాట్ బె వాచ్డ్ ఇన్ ఎ వాక్యూం". టైమ్. Archived from the original on June 17, 2020. Retrieved 19 July 2021.
- ↑ హాస్కెల్, మోలీ (2010). ఫ్రాంక్లీ, మై డియర్: గాన్ విత్ ద విండ్ రీవిజిటెడ్. ఐకాన్స్ ఆఫ్ అమెరికా. యేల్ యూనివర్సిటీ ప్రెస్. pp. 213–214. ISBN 978-0-300-16437-4.
- ↑ "లండన్ మూవీ డూయింగ్స్". ది న్యూయార్క్ టైమ్స్. June 25, 1944. X3.
- ↑ ఫిన్లర్, జోయెల్ వాల్డో (2003). ది హాలీవుడ్ స్టోరీ. వాల్‌ఫ్లవర్ ప్రెస్. pp. 47, 356–363. ISBN 978-1-903364-66-6.
- ↑ "AFI's 100 ఇయర్స్...100 మూవీస్". అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. June 1998. Archived from the original on May 15, 2016. Retrieved February 27, 2013.
- ↑ "AFI's 100 ఇయర్స్...100 మూవీస్ (10th యానివర్సరీ ఎడిషన్)". అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. June 20, 2007. Archived from the original on August 18, 2015. Retrieved February 27, 2013.
- ↑ "ఓట్స్ ఫర్ గాన్ విత్ ద విండ్ (1939)". బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. 2012. Archived from the original on February 17, 2018. Retrieved February 16, 2018.
- ↑ "ద 80 బెస్ట్ డైరెక్టెడ్ ఫిల్మ్స్". డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా. Spring 2016. Archived from the original on May 3, 2016. Retrieved May 4, 2016.
- ↑ "హాలీవుడ్స్ 100 ఫేవరెట్ ఫిల్మ్స్". ద హాలీవుడ్ రిపోర్టర్. June 25, 2014. Archived from the original on September 14, 2015. Retrieved July 13, 2014.
- ↑ "నేషనల్ ఫిల్మ్ ప్రిజర్వేషన్ బోర్డ్: ఫిల్మ్ రిజిస్ట్రీ - కంప్లీట్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ లిస్టింగ్". లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్. Archived from the original on October 31, 2016. Retrieved December 14, 2017.
- ↑ "నేషనల్ ఫిల్మ్ ప్రిజర్వేషన్ బోర్డ్: ఫిల్మ్ రిజిస్ట్రీ – నామినేట్". లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్. Archived from the original on December 16, 2017. Retrieved December 14, 2017.
ఉపయుక్త గ్రంథాలు
[మార్చు]- బ్రిడ్జస్, హెర్బ్ (1999). గాన్ విత్ ద విండ్: ది త్రీ డే ప్రీమియర్ ఇన్ అట్లాంటా. మెర్సర్ యూనివర్సిటీ ప్రెస్. ISBN 978-0-86554-672-1.
- కేమరాన్, జూడీ; క్రిస్ట్మన్, పాల్ జె. (1989). ది ఆర్ట్ ఆఫ్ గాన్ విత్ ద విండ్: మేకింగ్ ఆఫ్ ఎ లెజెండ్. ప్రెంటీస్ హాల్. ISBN 978-0-13-046740-9.
- హెర్మెట్జ్, అల్జీన్ (1996). ఆన్ ద రోడ్ టు తారా: ద మేకింగ్ ఆఫ్ గాన్ విత్ ద విండ్. న్యూయార్క్: హ్యారీ ఎన్. అబ్రామ్స్. ISBN 978-0-8109-3684-3.
- లాంబర్ట్, గావిన్ (1973). GWTW: ద మేకింగ్ ఆఫ్ గాన్ విత్ ద విండ్. న్యూయార్క్: లిటిల్ బ్రౌన్ అండ్ కంపెనీ. ISBN 978-0-316-51284-8.
- వెర్ట్రీస్, అలన్ డేవిడ్ (1997). సెల్జెనిక్స్ విజన్:గాన్ విత్ ద విండ్ అండ్ హాలీవుడ్ ఫిల్మ్‌మేకింగ్. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ప్రెస్. ISBN 978-0-292-78729-2.
బయటి లింకులు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- 1939 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Commons category link from Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- ఆంగ్ల భాషా సినిమాలు
- అమెరికన్ సినిమాలు
- చారిత్రాత్మక సినిమాలు
- అకాడమీ అవార్డు విజేతలు